నిన్న పంజాబ్ తో ఆర్సీబీకి జరిగిన మ్యాచ్ లో టిమ్ డేవిడ్ క్రీజులో అడుగుపెట్టేప్పటికి ఆర్సీబీ స్కోరు 33 పరుగులకే 5 వికెట్లు. జస్ట్ 6 ఓవర్లు అయ్యింది అప్పటికే మ్యాచ్ బిగిన్ అయ్యి. వర్షం కారణంగా 14 ఓవర్లకు కుదించిన మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆర్సీబీకి ఏదీ కలిసి రాలేదు. కెప్టెన్ పటీదార్ మినహా మరే బ్యాటరూ క్రీజులో నిలవలేకపోయాడు. కొహ్లీ, ఫిల్ సాల్ట్, లివింగ్ స్టన్, జితేశ్ శర్మ, కృనాల్ పాండ్యా అవుటయ్యాక అడుగుపెట్టాడు టిమ్ డేవిడ్. ఇందాక చెప్పుకున్నట్లు అప్పటికే 5 వికెట్లు కోల్పోయిన ఆర్సీబీ కళ్ల ముందు ఓ ఊహించని ప్రమాదం ఉంది. అదేంటంటే 49 పరుగుల్లోపు ఆలౌట్ అయిపోవటం. 2017 ఏప్రిల్ 23. కోల్ కతా లోని ఈడెన్ గార్డ్సెన్ లో కేకేఆర్ మీద ఊహించని రీతిలో ఆలౌట్ అయిపోయింది ఆర్సీబీ. కేవలం 49 పరుగులకే కుప్పకూలింది. నిన్న పంజాబ్ తో మ్యాచ్ లోనూ అంతే టిమ్ డేవిడ్ వచ్చేప్పటికే ఐదు వికెట్లు పడ్డాయి. తనొచ్చిన తర్వాత పటీదార్, మనోజ్ అయిపోవటంతో 42 పరుగులకే 7 వికెట్లు. ఇక ఆ టైమ్ లో RCB తన పేరిటే అత్యల్ప స్కోరు రికార్డును బద్ధలు కొట్టి 49 కంటే తక్కువకే ఆలౌట్ అయిపోతుందేమోనని ప్రతీ ఆర్సీబీ ఫ్యాన్ భయపడ్డాడు. కానీ టిమ్ డేవిడ్ ఆపద్భాంధవుడిలా కాపాడు. కెప్టెన్ రజత్ పటీదార్ మినహా అందరూ చెతులెత్తేసిన ఆర్సీబీని మళ్లీ 49 పరుగుల్లోపు ఆలౌట్ కాకుండా పరువు కాపాడటమే కాదు స్కోరు బోర్డును కాస్త పరుగులు పెట్టించాడు టిమ్ డేవిడ్. 26 బంతుల్లో 5 ఫోర్లు 3 సిక్సర్లతో సరిగ్గా 50 పరుగులు చేశాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్ లో కేవలం 4 సిక్సులు మాత్రమే నమోదు కాగా రజత్ 1 కొడితే..టిమ్ డేవిడ్ 3 సిక్సులు కొట్టాడు. ఫలితంగా నిర్ణీత 14 ఓవర్లలో ఆర్సీబీ 9 వికెట్ల నష్టానికి 95 పరుగులైనా చేయగలిగింది. అలా RCB పెద్ద కష్టం నుంచి గట్టెక్కించాడు. ఆర్సీబీ బౌలింగ్ వేస్తున్నప్పుడు తన ఫీల్డింగ్ తో పంజాబ్ ను భయపెట్టే ప్రయత్నం చేశాడు. ఓపెనర్లు ప్రియాంశ్ ఆర్య, ప్రభ్ సిమ్రన్ సింగ్ ఇద్దరూ అవుటయ్యే వాళ్లు కొట్టిన బాల్స్ ని క్యాచ్ పట్టుకుంది టిమ్ డేవిడే. సో అలా మ్యాచ్ ఆర్సీబీ ఓడినా ఘోరంగా ఓడిపోకుండా కష్టపడి తన టీమ్ కు అటు బ్యాటింగ్ లో ఇటు ఫీల్డింగ్ లో అండగా నిలబడిన టిమ్ డేవిడ్ మ్యాచ్ ఆర్సీబీ ఓడిపోయినా సరే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం. ఇలా ఓడిపోయిన టీమ్ లో ఒకడికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఇవ్వటం ఈ సీజన్ లో ఇదే తొలిసారి. టిమ్ డేవిడ్ కు మరి దక్కిందంటే అర్థం చేసుకోవచ్చు. అతని ఇన్నింగ్స్ ఎంత వ్యాల్యుబులో.